Wednesday, April 24, 2013

కర్నాటక సంగీతం లో సాఫ్ట్వేర్ పాత్ర


సాఫ్ట్వేర్ ఆనగా, కంప్యూటర్ లో మనం వాడుకునే అప్లికేషన్స్ తయారుచేయడానికి ఇంకా నడవడానికి ఉపోయోగపడే శాస్త్రం - ఒక కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ పని చెయ్యటానికి కావలసిన లేక అవసరమైన సూచనలు. ఒక కంప్యూటర్ లో ఏదైనా పని చెయ్యటానికి అవసరమైన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సూచనలను కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అని అనవచ్చు.

ఆధునిక కాలం లో సాఫ్ట్వేర్ పాత్ర అపరిమితం. సాఫ్ట్వేర్ ఉపోయోగించని రంగం ఏది లేదు. సాఫ్ట్వేర్ వినియోగం ఎంతగా పెరిగిందంటే పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు దగ్గిరనుంచి ఆకాశం లోకి పంపించే రాకెట్స్ వరకు సాఫ్ట్వేర్ ఉపయోగం ఉంది. సంగీతంలో కూడా సాఫ్ట్వేర్ ప్రభావం చాలా ఉంది. విద్యార్ధులు నేర్చుకునే పాఠం దగ్గరనుంచీ మనం వింటున్న కచేరీల వరకు, నేడు సంగీతం లో సాఫ్ట్వేర్ పాత్ర అపరిమితం.

పూర్వం సంగీతం నేర్చుకోవాలంటే, గురువుగారి ఇంట్లో ఉంటూ, ఆయనకి సేవలు చేస్తూ, ఆయన ఎప్పుడు నేర్పిస్తే అప్పుడు నేర్చుకుంటూ కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర వుండి నేర్చుకునే వారు. కానీ నేడు యీ సాఫ్ట్వేర్ వినియోగం తో ఇంట్లోనే ఉంటూ స్కైప్ మొ|| ఆన్‌లైన్ అప్స్ ద్వారా నేర్చుకుంటున్నారు. ఇంకా నేడు అంతర్జాలం లో అనేక వెబ్ సైట్స్ ద్వారా కూడా పాఠాలు నేర్చుకుంటున్నారు. కేసెట్ రికార్డర్స్ ద్వారా, CD  డ్రైవ్ ల ద్వారా కూడా మనం నేడు సంగీత పాఠాలను నేర్చుకోగాలుగుతున్నాము. ఇవన్ని కూడా నేటి కాలంలో మనకి అందుబాటులోకి వొచ్చిన ఆధునిక యంత్రాలతోనే సాధ్యపడుతోంది. ఈ ఆధునిక యంత్రాలన్నీ పని చేసేది సాఫ్ట్వేర్ సహాయంతోనే.

ఇంతే కాకుండా, నేడు మనం మంచి కచేరీ వినాలంటే, ఇంట్లోనే వుండి సాటిలైట్ ద్వారా ప్రసారం అయ్యే అనేక చానల్స్ ద్వారా వినచ్చు. AIR ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ కూడా సాఫ్ట్వేర్ సహాయం తోనే మనకి రేడియో ద్వారా అందుతున్నాయి. దూరదర్శన్, ఇంకా అనేక టీవీ ఛానల్స్ ద్వారా మనకి ప్రసారం అయ్యే కార్యక్రమాలన్నీ కూడా కంప్యూటర్ మీద ఆధారపడ్డవే!

ఇంకా విద్యార్ధులు సంగీత సాధన లో సహాయ పడటానికి 'శ్రుతి బాక్స్', మెట్రోనిం' ఇంకా 72 మేళకర్త అప్ మొదలగు అప్లికేషన్స్ విద్యార్ధులకు ఎంతో ఉపయోగ పడుతున్నయ్యి. ఇంకా యుట్యూబ్,  రాగా.కాం మొదలైన వెబ్ సైట్స్  ద్వారా అనేక సంగీత కచేరీ లను విని వారి సంగీత పరిజ్ఞానాన్ని పెంచుకోగలుగుతున్నారు. ఇంకా సంగీతాసక్తి కలిగిన వారు, వారి సంగీత పరిజ్ఞానాన్ని బ్లాగ్స్ ద్వార అందరితో పంచుకోగలుగుతున్నారు.